ఢిల్లీ ఎయిర్ పోర్ట్ గేట్ వద్ద మాదకద్రవ్యాల కవర్ లభ్యం!
- గేట్ నెంబర్ 11 వద్ద కవర్ వదిలేసి వెళ్లిన స్మగ్లర్లు
- 51 క్యాప్స్యూల్స్ లో కొకైన్ ను గుర్తించిన కస్టమ్స్ అధికారులు
- దీని విలువ రూ 15 కోట్లు ఉంటుందని అంచనా
ఎయిర్ పోర్టులో డ్రగ్స్ పట్టుబడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కస్టమ్స్ అధికారుల కదలికలను గుర్తించిన స్మగ్లర్లు డ్రగ్స్ ఉన్న కవర్ ను గేట్ వద్ద వదిలేసి పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కవర్ ఎవరు తెచ్చారు? వారు ఏ దేశం నుంచి వచ్చారు? అనే విషయంపై దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనపై కస్టమ్స్ అధికారులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.