IPL: తన ఆరోగ్యంపై స్వయంగా ప్రకటన చేసిన ఐపీఎల్ ఆక్షనీర్ హ్యూ ఎడ్మీడ్స్

Hugh Edmeades Comments On His Health
  • అంతా బాగానే ఉందని వెల్లడి
  • బీసీసీఐ, ఐపీఎల్ కు కృతజ్ఞతలు
  • చారు శర్మ బాగా చేస్తున్నాడని కామెంట్
వేలం సందర్భంగా నిన్న కుప్పకూలిపోయిన వేలం నిర్వాహకుడు (ఆక్షనీర్) హ్యూ ఎడ్మీడ్స్ క్షేమంగా ఉన్నారు. ఆయనే స్వయంగా ఇవాళ ప్రకటన చేశారు. రెండో రోజు మెగా వేలం ప్రారంభానికి ముందు తన ఆరోగ్యం గురించి చెప్పుకొచ్చారు.

‘‘ఇప్పుడు నా ఆరోగ్యం అంతా బాగానే ఉంది. కానీ, ఐపీఎల్ వేలం కోసం నేను 100 శాతం పనిచేయలేకపోయినందుకు బాధగా ఉంది. తన ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ ధన్యావాదాలు చెప్పారు. బీసీసీఐ, ఐపీఎల్, ఆటగాళ్లు, జట్టు యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. న్యూజిలాండ్ నుంచి కిలిమంజారో వరకు తాను క్షేమంగా ఉండాలంటూ కోరుకున్నారని చెప్పారు.

తన స్థానంలో చారు శర్మ వేలం నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. చారు శర్మ చాలా బాగా పనిచేస్తున్నారని, ఆటగాళ్లు మరిన్ని డబ్బులు సంపాదించుకునేలా పనిచేయాలని అన్నారు. 
IPL
Mega Auction
Hugh Edmeades

More Telugu News