KTR: పశ్చిమ హైదరాబాద్ కు పోటీగా.. తూర్పు హైదరాబాద్ అభివృద్ధి: కేటీఆర్

Will Create One Lakh IT Jobs In East Hyderabad Says KTR
  • లక్ష మంది ఐటీ ఉద్యోగులు పనిచేసేలా ప్రణాళికలు
  • జెన్ ప్యాక్ట్ క్యాంపస్ విస్తరణకు శంకుస్థాపన
  • వరంగల్ లోనూ ఏర్పాటు చేస్తున్నందుకు మంత్రి ధన్యవాదాలు
ఈస్ట్ హైదరాబాద్ లో లక్ష మంది ఐటీఉద్యోగులు పనిచేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నలు దిక్కులా ఐటీని విస్తరింపజేస్తామని చెప్పారు. ఇవాళ ఉప్పల్ లో జెన్ ప్యాక్ట్ విస్తరణకు ఆయన శంకుస్థాపన చేశారు. జెన్ ప్యాక్ట్ విస్తరణ పూర్తయితే లక్ష్యాన్ని చాలా సులువుగా చేరుకుంటామని ఆయన చెప్పారు. జెన్ ప్యాక్ట్ ను వరంగల్ కూ విస్తరిస్తున్నారని, అందుకు సంస్థకు ధన్యవాదాలని కేటీఆర్ అన్నారు.

తూర్పు హైదరాబాద్ డెవలప్ మెంట్ కోసం నాగోల్ లో శిల్పారామాన్ని ఏర్పాటు చేశామన్నారు. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఇక్కడే ఉందన్నారు. పశ్చిమ హైదరాబాద్ కు దీటుగా తూర్పు ప్రాంతం అభివృద్ధి జరుగుతోందన్నారు. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు, ఉప్పల్ జంక్షన్ లో స్కైవాక్ ను నిర్మిస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో ఐటీని విస్తరించేందుకు చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయని, ప్రైవేట్ డెవలపర్లకు తప్పకుండా మద్దతిస్తామని ఆయన చెప్పారు.
KTR
Telangana
TRS
Genpact

More Telugu News