Team India: టీమిండియా యువ బౌలర్లపై కాసుల వర్షం... దీపక్ చహర్ కు రూ.14 కోట్లు, ప్రసిద్ధ్ కృష్ణకు రూ.10 కోట్లు

Team India young pacers gets high prices in IPL Auction
  • కొనసాగుతున్న ఐపీఎల్ వేలం
  • ఇటీవల రాణిస్తున్న చహర్, ప్రసిద్ధ్
  • చహర్ ను సొంతం చేసుకున్న చెన్నై
  • ప్రసిద్ధ్ ను కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్
ఇటీవల కాలంలో టీమిండియా తరఫున మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న యువ బౌలర్లపై ఐపీఎల్ వేలంలో కాసుల వర్షం కురిసింది. దీపక్ చహర్ ఏకంగా రూ.14 కోట్లు దక్కించుకోగా, ప్రసిద్ధ్ కృష్ణకు రూ.10 కోట్ల ధర పలికింది. చహర్ ను అతడి పాత జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ కొనుగోలు చేసింది. గతంలో అతడు జట్టుకు అందించిన సేవలకు ప్రతిఫలంగా ఘనమైన ధరను ముట్టచెప్పింది.

ఇక, ప్రసిద్ధ్ కృష్ణ ఇటీవలే టీమిండియాలోకి వచ్చాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. సఫారీలపై ఒక వన్డే ఆడి 3 వికెట్లు తీశాడు. వెస్టిండీస్ తో సిరీస్ లోనూ రాణించాడు. ఈ సిరీస్ లో 3 వన్డేల్లో 9 వికెట్లు పడగొట్టాడు. ఇవాళ్టి ఐపీఎల్ వేలంలో ప్రసిద్ధ్ కృష్ణను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది.
Team India
Deepak Chahar
Prasidh Krishna
IPL-2022
Auction

More Telugu News