Medaram: మేడారంకు రేపటి నుంచి హెలికాప్టర్‌ సేవలు.. టికెట్ ధరలు ఎంతంటే?

Helicopter services to Madaram starts from tomorrow
  • హనుమకొండ నుంచి మేడారంకు హెలికాప్టర్ సర్వీసులు
  • రానుపోను ఒక్కొక్కరికి రూ. 19,999
  • జాతరను ఏరియల్ వ్యూ ద్వారా చూడాలనుకుంటే రూ. 37 వేలు
దేశంలో జరిగే అతిపెద్ద జాతరలలో మేడారం రెండో స్థానంలో ఉంది. లక్షలాది మంది భక్తులు మేడారంలో జాతరకు హాజరై... సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు రేపటి (ఫిబ్రవరి 13) నుంచి హెలికాప్టర్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకువస్తోంది. హనుమకొండ నుంచి భక్తులను మేడారం చేర్చేందుకు రాష్ట్ర పర్యాటకశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ హెలికాప్టర్ సేవలను అందించనుంది.

హనుమకొండ నుంచి మేడారంకు వెళ్లి, మళ్లీ అక్కడ నుంచి హనుమకొండకు రావడానికి ఒక్కొక్కరికి టికెట్ ధరను రూ. 19,999గా నిర్ణయించారు. దీనికి తోడు 8 నుంచి 10 నిమిషాల జాతర విహంగ వీక్షణం కోసం రూ. 37 వేల టికెట్ ఫిక్స్ చేశారు. ఒక్కో ట్రిప్పులో ఆరుగురు ప్రయాణించే అవకాశం ఉంటుంది. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. టికెట్లను బుక్ చేసుకోవడానికి హెలీట్యాక్సీ వెబ్ సైట్లోకి వెళ్లాలి లేదా 9400399999, 9880505905 నంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది.
Medaram
Helicopter
Telangana

More Telugu News