Sudheer: ‘గన్స్ డోంట్ లై’.. ఆసక్తికరంగా సుధీర్ కొత్త సినిమా

Sudheer babu announces his 16
  • 16వ సినిమాను ప్రకటించిన సుధీర్
  • దర్శకుడిగా మహేశ్
  • ఫస్ట్ లుక్ ను వదిలిన చిత్ర యూనిట్
హీరో సుధీర్ బాబు మంచి జోష్ మీదున్నాడు. ఇటీవలే 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాతో మంచి హిట్ అందుకున్న అతడు.. ఇప్పుడు తన 16వ చిత్రానికి ముహూర్తం ఫిక్స్ చేసేసుకున్నాడు. మహేశ్ దర్శకత్వంలో యాక్షన్ ప్యాక్డ్ సినిమాలో నటించబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను వదిలారు.

చుట్టూ తుపాకులు, పోలీస్ స్పెషల్ క్రైమ్స్ డివిజన్ అనే లోగోతో పోస్టర్ ను క్రియేట్ చేశారు. ‘గన్స్ డోంట్ లై’ అనే ట్యాగ్ లైన్ ను పెట్టారు. భరత్, శ్రీకాంత్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. అరుల్ విన్సెంట్ ఛాయాగ్రహణం అందించనున్నారు. 'అపరిమితమైన యాక్షన్ కు సిద్ధం కండి..' అంటూ సుధీర్ ట్వీట్ చేశాడు.
Sudheer
Tollywood

More Telugu News