Vishal: షూటింగులో గాయపడిన సినీ నటుడు విశాల్.. వీడియో ఇదిగో..

Vishal suffers hairline fracture while shooting for stunt sequences in upcoming film Laththi
  • లాఠీ సినిమా చిత్రీకరణలో గాయం
  • బాలుడిని రక్షించి కిందికి దూకే యత్నంలో చేతికి గాయాలు
  • విశ్రాంతి, చికిత్స కోసం కేరళ వెళ్తున్నట్టు చెప్పిన విశాల్
ప్రముఖ సినీ నటుడు విశాల్ గాయపడ్డారు. ‘లాఠీ’ సినిమాలో భాగంగా ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా చేతికి స్వల్పంగా గాయాలయ్యాయి. బాలుడిని రక్షించే సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ ఘటన జరిగింది. చిన్నారిని పట్టుకుని కిందికి దూకే యత్నంలో చేతి ఎముకకు గాయమైనట్టు విశాల్ ట్వీట్ చేసిన వీడియోలో కనిపిస్తోంది. అందులో ఆయన పోలీస్ అధికారిగా కనిపించారు.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను ఎ.వినోద్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. రమణ, నంద నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సునయన కథానాయిగా నటిస్తున్నారు. కాగా, ఫైట్‌ సీన్ చిత్రీకరిస్తుండగా స్వల్పంగా గాయపడినట్టు పేర్కొన్న విశాల్.. చికిత్స, విశ్రాంతి కోసం కేరళ వెళ్తున్నట్టు తెలిపారు. మార్చి తొలి వారంలో తిరిగి తుది షెడ్యూల్‌లో పాల్గొంటానని విశాల్ పేర్కొన్నారు.
Vishal
Actor
Kollywood
Laththi

More Telugu News