Twitter: ప్రపంచవ్యాప్తంగా గంటపాటు ఆగిపోయిన ట్విట్టర్ పిట్ట కూత.. క్షమాపణలు కోరిన ట్విట్టర్

Twitter Down Thousands Around The World
  • గత రాత్రి 11 గంటల నుంచి మొరాయింపు
  • భారత్‌లోనూ సేవలకు అంతరాయం
  • సాంకేతిక సమస్యలే కారణమన్న ట్విట్టర్
ప్రపంచ వ్యాప్తంగా గంటపాటు ట్విట్టర్ పిట్ట కూత ఆగిపోయింది. దీంతో యూజర్లు నానా అవస్థలు పడ్డారు. గత రాత్రి 11 గంటల నుంచి గంటపాటు ట్వీట్ చేయడంలో యూజర్లు ఇబ్బంది పడ్డారు. భారత్‌లోనూ ట్విట్టర్ సేవలు ఆగిపోయాయి. మొబైల్ మాత్రమే కాదు వెబ్‌సైట్‌లోనూ ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ మొరాయించింది. లోడింగ్ సమస్యతోపాటు పోస్టింగ్‌లు చేయలేకపోయామని, లాగిన్ కూడా కాలేకపోయామని యూజర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్విట్టర్‌ను ఉపయోగిస్తుండగానే మధ్యలోనే అది లాగౌట్ అయిందని మరికొందరు తెలిపారు. స్పందించిన ట్విట్టర్ వెంటనే సేవలను పునరుద్ధరించింది. సాంకేతిక సమస్యల కారణంగా సేవలకు అంతరాయం కలిగినట్టు తెలిపింది. యూజర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమించాలని వేడుకుంది.
Twitter
Social Media
Sevice Down

More Telugu News