Vijay Sai Reddy: తాను బీకాం చదవలేదని అశోక్ బాబు స్వయంగా చెప్పారు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy opines on Ashok Babu issue
  • తప్పుడు సర్టిఫికెట్ ఆరోపణలపై అశోక్ బాబు అరెస్ట్
  • టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం
  • ప్రభుత్వాన్ని మోసం చేశాడన్న విజయసాయి
  • చంద్రబాబు చిందులు తొక్కుతున్నాడని వ్యాఖ్యలు

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు గతంలో వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా పనిచేసి రిటైరయ్యారు. అయితే, ఉద్యోగంలో కొనసాగిన సమయంలో తప్పుడు సర్టిఫికెట్ తో ప్రమోషన్ సంపాదించారన్న ఆరోపణలపై ఆయనను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై ట్విట్టర్ లో స్పందించారు.

తాను బీకామ్ చదవలేదని అశోక్ బాబే స్వయంగా చెప్పారని విజయసాయి పేర్కొన్నారు. సర్టిఫికెట్ ను తారుమారు చేసి ఏసీటీవోగా ప్రమోషన్ కొట్టేశాడని ఆరోపించారు. ప్రభుత్వాన్ని మోసం చేసిన కేసులో సీఐడీ అధికారులు అశోక్ బాబును అరెస్ట్ చేశారని, అయితే ఈ అరెస్ట్ కు తగిన మూల్యం చెల్లిస్తారంటూ చంద్రబాబు చిందులు తొక్కుతున్నాడని విజయసాయి విమర్శించారు. మీ తప్పులకు ఇప్పటికే మూల్యం చెల్లిస్తున్నారుగా బాబూ! అంటూ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News