Deepika Padukone: జూనియర్ ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్న బాలీవుడ్ భామ

Bollywood beauty Deepika Padukone says she obsessed with Jr NTR
  • ఇంటర్వ్యూలో ఆసక్తికర సంగతులు చెప్పిన దీపిక
  • సౌత్ హీరోల్లో ఎన్టీఆర్, బన్నీ ఇష్టమని వెల్లడి
  • ఎన్టీఆర్ అంటే పడిచచ్చిపోతానని వివరణ
  • రాజమౌళి దర్శకత్వంలో నటించాలనుందని వ్యాఖ్యలు
ఇటీవల పలు టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విజయవంతం అవుతున్నాయి. ఇటీవల రిలీజైన పుష్ప చిత్రం ఇప్పటికీ దేశవ్యాప్తంగా సందడి చేస్తోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై భాషలకు అతీతంగా భారీ క్రేజ్ నెలకొంది. ఈ సినిమాలో హీరోలుగా నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పై జాతీయ మీడియా సైతం ఆసక్తి చూపిస్తోంది.

తాజాగా, బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకొణే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని వెల్లడించింది. దక్షిణాది హీరోల్లో ఎవరితో నటించాలని కోరుకుంటారు? అని ప్రశ్నించగా, దీపిక టక్కున జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అని చెప్పింది. ఎన్టీఆర్ తో చాన్స్ అంటే ఎగిరి గంతేస్తానని తెలిపింది. అతడిది అద్భుతమైన పర్సనాలిటీ అని కితాబునిచ్చింది.

ఇక, దర్శకుల్లో ఎవరితో పనిచేయాలనుకుంటున్నారు? అని ప్రశ్నించగా, రాజమౌళి, అయాన్ ముఖర్జీల పేర్లు చెప్పింది. దీపిక పదుకొణే నటించిన 'గెహరాయియా' చిత్రం నేడు రిలీజైంది. శకున్ బాత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దీపిక పదుకొణే, అనన్యా పాండే, సిద్ధాంత్ చతుర్వేది, ధైర్య కర్వా నటించారు.
Deepika Padukone
Jr NTR
Allu Arjun
RRR
Bollywood

More Telugu News