Ashok Babu: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు బెయిల్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా

High Court adjourns hearing of Ashok Babu bail plea
  • అశోక్ బాబుపై ఫోర్జరీ ఆరోపణలు
  • అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు
  • మధ్యంతర బెయిల్ కు దరఖాస్తు చేసుకున్న అశోక్ బాబు

సర్టిఫికెట్ల ఫోర్జరీ ఆరోపణల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే. కాగా, అశోక్ బాబు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. సర్టిఫికెట్ల ఫోర్జరీపై సీఐడీ ఏ ఆధారాలతో అరెస్ట్ చేసిందని అశోక్ బాబు తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. ఇందులో లోకాయుక్త విచారణకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అశోక్ బాబు ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదని, ఆయన అరెస్ట్ సరికాదని వారు కోర్టుకు తెలియజేశారు.

దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాదులు స్పందిస్తూ, ఆధారాల సమర్పణకు మరికొంత సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. అప్పటివరకు అశోక్ బాబుకు బెయిల్ ఇవ్వవొద్దని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులను ఆదేశించింది. అన్ని పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News