Kodali Nani: ఇంటర్ చదివి డిగ్రీ సర్టిఫికెట్లు పెట్టారు: అశోక్ బాబుపై కొడాలి నాని విమర్శలు

Ashok Babu gets promotion with fake certificates says Kodali Nani
  • దొంగ సర్టిఫికెట్లతో ప్రమోషన్ పొందారు
  • అశోక్ బాబుపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేయలేదు
  • తప్పు చేసినందుకే అశోక్ బాబును సీఐడీ అరెస్ట్ చేసింది
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. దొంగ సర్టిఫికెట్లతో ఆయన ప్రమోషన్ పొందారని ఆరోపించారు. ఇంటర్ చదివి డిగ్రీ చదివినట్టు సర్టిఫికెట్లు పెట్టారని అన్నారు. అశోక్ బాబుపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేయలేదని, అయినా టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. తప్పు చేసినందుకే అశోక్ బాబును సీఐడీ అరెస్ట్ చేసిందని అన్నారు. కొత్త జిల్లాలపై కూడా టీడీపీ రాద్ధాంతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినా వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
Kodali Nani
YSRCP
Ashok Babu
Telugudesam

More Telugu News