Lalu Prasad Yadav: మోదీకి పిల్లలు పుట్టాలని దేవుడిని ప్రార్థిస్తున్నా: లాలూ ప్రసాద్ యాదవ్

I pray God to give children to Modi says Lalu Prasad
  • వంశపారంపర్య రాజకీయాల వల్ల దేశం నాశనమవుతోందన్న మోదీ
  • మోదీకి పిల్లలు లేకపోతే నేనేం చేయగలనన్న లాలూ
  • వారికి పిల్లలు పుట్టి రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నానని వ్యాఖ్య
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లకు పిల్లలు పుట్టాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. వారిద్దరికీ పిల్లలు పుట్టాలని, వారు కూడా వంశపారంపర్య రాజకీయాలు అనే వాదనలో చేరాలని కోరుకుంటున్నానని చెప్పారు. తాజా ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ వంశపారంపర్య రాజకీయాలు దేశానికి చేటు తెస్తాయని అన్నారు.

మోదీకి పిల్లలు లేకపోతే తానేం చేయగలనని, నితీశ్ కు ఒక కుమారుడు ఉన్నప్పటికీ ఆయన రాజకీయాలకు తగినవాడు కాదని... దీనికి తానేం చేయగలనని లాలూ ఎద్దేవా చేశారు. వారి పిల్లలు కూడా వంశపారంపర్య రాజకీయాల్లో చేరేలా వారికి కూడా పిల్లలు పుట్టాలని దేవుడిని కోరుకుంటున్నానని అన్నారు.
Lalu Prasad Yadav
RJD
Narendra Modi
BJP

More Telugu News