Manchu Vishnu: మీకు మా ఇంట్లో ఆతిథ్యమివ్వడం ఎంతో సంతోషంగా ఉంది నాని గారు: మంచు విష్ణు

Very happy to host Perni Nani says Manchu Vishnu
  • బొత్స కుమారుడి పెళ్లి కోసం హైదరాబాద్ వచ్చిన పేర్ని నాని
  • మోహన్ బాబు ఇంటికి వెళ్లిన వైనం
  • ఇండస్ట్రీ ప్రయోజనాలు కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన విష్ణు
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఈరోజు హైదరాబాదులోని మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. మంత్రి బొత్స కుమారుడి పెళ్లి కోసం హైదరాబాదుకు వచ్చిన ఆయన మోహన్ బాబును కలిశారు. ఈ విషయాన్ని మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. మీకు మా ఇంట్లో ఆతిథ్యమివ్వడం చాలా సంతోషంగా ఉంది నాని గారు అని ఆయన ట్వీట్ చేశారు. 'సినిమా టికెట్ల అంశంపై మీరు తీసుకున్న చొరవకు, తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్రణాళికలను మాకు వివరించినందుకు ధన్యవాదాలు. ఇండస్ట్రీ ప్రయోజనాలను కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు' అని అన్నారు.
Manchu Vishnu
Mohan Babu
Tollywood
Perni Nani
YSRCP

More Telugu News