Entertainment: సీఎం జగన్ తో సినీ ప్రముఖుల భేటీపై రాంగోపాల్ వర్మ వ్యంగ్యాస్త్రాలు

Super Mega Bahubali Level Begging Says Verma On Cine Industry Meeting With CM Jagan
  • స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు
  • సూపర్, మెగా, బాహుబలి స్థాయి బెగ్గింగ్ అంటూ కామెంట్
  • అందుకే సీఎం జగన్ వరాలిచ్చారన్న వర్మ
ఏపీ సీఎం జగన్ తో సినీ ప్రముఖులు చిరంజీవి, రాజమౌళి, మహేశ్ బాబు, కొరటాల శివ, ప్రభాస్, నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణమురళిల భేటీపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఆ సమావేశంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ట్వీట్ లో టాలీవుడ్ స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

సూపర్, మెగా, బాహుబలి స్థాయిలో అడుక్కోవడం వల్లే ఈ సమావేశం జరిగిందని, ఒమెగాస్టార్ సీఎం జగన్ వారికి వరాలు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలి వైఎస్ జగన్ చొరవను తాను ఎంతో అభినందిస్తున్నానని చెప్పారు.

ఏపీ ప్రభుత్వం, తెలుగు సినీ పరిశ్రమ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక పరిస్థితులకు తెరదించేందుకు, భవిష్యత్ లో అంతా సాఫీగా సాగేందుకు కృషి చేసిన ఒమెగాస్టార్ సీఎం జగన్ ను అభినందించాలని అన్నారు.
Entertainment
YS Jagan
Ram Gopal Varma
RGV
Chiranjeevi
Prabhas
Mahesh Babu
Rajamouli
Koratala Siva

More Telugu News