Pavan Kalyan: ఈ నెలలోనే రానున్న 'భీమ్లా నాయక్'?

  • మల్టీస్టారర్ గా 'భీమ్లా నాయక్'
  • పవన్ సరసన నిత్యమీనన్
  • రానా జోడీగా సంయుక్త మీనన్
  • సంగీత దర్శకుడిగా తమన్
Bheemla Nayak movie update

పవన్ కల్యాణ్ - రానా ప్రధాన పాత్రధారులుగా 'భీమ్లా నాయక్' రూపొందింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో, పవన్ సరసన నిత్యామీనన్ నటించగా, రానా జోడీగా సంయుక్త మీనన్ అలరించనుంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారుగానీ కుదరలేదు. ఆ తరువాత ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేశారు.

అయితే ఆ తరువాత జరిగిన సర్దుబాట్లలో వీలైతే ఫిబ్రవరి 25కి .. లేదంటే ఏప్రిల్ 1వ తేదీకి అన్నట్టుగా చెప్పారు. దాంతో దాదాపు ఈ సినిమా ఏప్రిల్లోనే ప్రేక్షకుల ముందుకు రావొచ్చునని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను ఈ నెలలో ముందుగా చెప్పిన తేదీనే రిలీజ్ చేయాలనే ఆలోచన ఉన్నారని తెలుస్తోంది.

అందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయనీ, త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్లు అంచనాలను పెంచేశాయి. తమన్ బాణీలు పవన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఏడాదిలో పవన్ నుంచి వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.

More Telugu News