Venkaiah Naidu: ఘనంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహం.. గవర్నర్ సహా పలువురు ప్రముఖుల హాజరు

Venkaiah Naidu daughter in law marriage held in tirumala
  • తిరుమల పుష్పగిరి మఠంలో వివాహం
  • వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల హాజరు
  • కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో అతిథులకు ఆహ్వానం
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  కుమార్తె ఎం.దీప-వెంకటరావు దంపతుల కుమార్తె సుష్మ-కిషన్ వివాహం నిన్న ఘనంగా జరిగింది. తిరుమలలోని పుష్పగిరి మఠంలో వైభవంగా జరిగిన ఈ వివాహానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్, బీజేపీ నేత సత్యకుమార్‌తోపాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.

కరోనా నేపథ్యంలో ఈ వివాహానికి పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు. కాగా, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దంపతులు తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు.
Venkaiah Naidu
Tirumala
Sushma
Marriage

More Telugu News