Sharwanand: 'ఆడవాళ్లు మీకు జోహార్లు' నుంచి టీజర్ రిలీజ్!

Adavallu Meeku Joharlu movie teaser released
  • శర్వానంద్ నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్
  • కథానాయికగా రష్మిక 
  • ముఖ్య పాత్రల్లో రాధిక, ఖుష్బూ, ఊర్వశి
  • ఈ నెల 25వ తేదీన సినిమా విడుదల
శర్వానంద్ కి ఇటు యూత్ లోను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ లోను మంచి క్రేజ్ ఉంది. అందువలన వాళ్లకి కనెక్ట్ అయ్యే కథలనే ఆయన ఎక్కువగా ఎంచుకుంటూ వెళుతున్నాడు. అలా ఆయన కిశోర్ తిరుమల దర్శకత్వంలో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చేయడానికి అంగీకరించడం .. ఆ సినిమా పూర్తయిపోవడం జరిగింది.

సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. హీరో చాలామందిని పెళ్లి చూపులు చూస్తాడు .. అయినా ఎవరూ నచ్చరు. ఆ తరువాత ఆయన నచ్చేలేదని చెప్పే అమ్మాయిల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఈ లైన్ పైనే కామెడీని వర్కౌట్ చేశారు.

ఇక చివరిసారిగా హీరో .. హీరోయిన్ పైనే ఆశలు పెట్టుకుంటాడు .. కానీ ఆమె కూడా ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పేస్తుంది. అప్పుడు హీరో ఏం చేశాడనేదే కథ. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో, రాధిక .. ఖుష్బూ .. ఊర్వశి ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
Sharwanand
Rashmika Mandanna
Aadavallu Meeku Joharlu Movie

More Telugu News