Akhil: మళ్లీ సెట్స్ పైకి వెళుతున్న 'ఏజెంట్'

  • 'ఏజెంట్' గా అఖిల్
  • కథానాయికగా సాక్షి వైద్య పరిచయం
  • కీలకమైన పాత్రలో మమ్ముట్టి
  • సంగీత దర్శకుడిగా తమన్
Agent movie update

అఖిల్ తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి భారీ బడ్జెట్ సినిమాలనే చేస్తూ వస్తున్నాడు. ఆ సినిమాలలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాంతో అఖిల్ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తరువాత సినిమా అయిన 'ఏజెంట్'ను మంచి ఉత్సాహంతో చేస్తూ వెళుతున్నాడు.

అయితే కథాపరంగా ఈ సినిమా చిత్రీకరణ కూడా విదేశాల్లో ఎక్కువగా నడుస్తూ వచ్చింది. కరోనా తీవ్రంగా ఉన్న కారణంగా బ్రేక్ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీ తరువాత నుంచి తదుపరి షెడ్యూల్ మొదలవుతున్నట్టుగా తెలుస్తోంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను మమ్ముట్టి పోషిస్తున్నారు. ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇక కథానాయికగా ఈ సినిమాతో సాక్షి వైద్య పరిచయమవుతోంది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News