Jagityal: రూ. 6 లక్షలు పట్టుకుని ప్రియుడితో పారిపోయిన యువతి.. ప్రేమ జంటను పట్టుకున్న పోలీసులు

  • కుటుంబంతో సన్నిహితంగా ఉండే యువకుడితో లవ్
  • ఇంటి అవసరాల కోసం దాచిపెట్టిన సొమ్ముతో ఉడాయింపు
  • పది రోజులపాటు గాలించి పట్టుకున్న పోలీసులు
young Girl elope with Boy Friend with Rs 6 lakhs

ప్రేమ మైకంలో నిండా మునిగిన ఓ యువతి ఇంట్లోంచి 6 లక్షల రూపాయలు తీసుకుని ప్రియుడితో ఉడాయించింది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలానికి చెందిన యువతి తన కుటుంబంతో సన్నిహితంగా ఉండే యువకుడితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో అతడి ప్రేమలో పూర్తిగా కూరుకుపోయిన యువతి.. కుటుంబ అవసరాల కోసం ఇంట్లో దాచిపెట్టిన రూ. 6 లక్షలు తీసుకుని యువకుడితో వెళ్లిపోయింది.

కుమార్తెతోపాటు ఇంట్లో దాచిపెట్టిన రూ. 6 లక్షలు కూడా మాయం కావడంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది రోజులపాటు గాలించి ఎట్టకేలకు వారిని పట్టుకున్నారు. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కోరుట్ల సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ.. ప్రేమ పేరుతో యువతీయువకులు తప్పుడు మార్గాల్లో నడిచి జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు.

More Telugu News