Nagarjuna: ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేస్తున్న 'బంగార్రాజు'

Bangarraju Movie Update
  • జనవరి 14న వచ్చిన 'బంగార్రాజు' 
  • సంక్రాంతి విజేతగా నిలిచిన సినిమా 
  • అదనపు బలంగా నిలిచిన అనూప్ సంగీతం
  • ఈ నెల 18 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్  

నాగార్జున - నాగచైతన్య కథానాయకులుగా రూపొందిన 'బంగార్రాజు' ..  సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నుంచి కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది.

రీసెంట్ గా ఈ సినిమా 25 రోజులను పూర్తిచేసుకుంది. ఇక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ దిశగా పరుగులు తీస్తోంది. ఈ నెల 18వ తేదీ నుంచి జీ 5లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. థియేటర్లో ఈ సినిమాను చూడలేకపోయినవారికి .. మళ్లీ చూడాలనుకున్న వారికి ఇది ఉత్సాహాన్ని ఇచ్చే వార్తనే.
  
అన్నపూర్ణ బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు. గ్రామీణ నేపథ్యానికి తగిన విధంగా .. రొమాంటిక్ పాళ్లకి తగినట్టుగా ఆయన అందించిన బాణీలు జనంలోకి బాగా వెళ్లాయి. ఈ సినిమా విజయంలో పాటలు కీలకమైన పాత్రను పోషించాయి.

  • Loading...

More Telugu News