Vijayawada: విజయవాడలో దారుణం.. వివాహితను ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం.. వీడియో తీసిన నిందితుడి భార్య

Man Raped married woman in vijayawada his wife recorded video
  • వివాహిత ఇంట్లోకి చొరబడి నోరు మూసి తన ఇంటికి లాక్కొచ్చిన నిందితుడు
  • వీడియోలు చూపించి తర్వాతి రోజు మళ్లీ అఘాయిత్యం
  • ఎవరికైనా చెబితే వీడియోలు బయటపెట్టి పరువు తీస్తానని బెదిరింపు
  • స్నేహితుల కోరిక కూడా తీర్చాలంటూ వేధింపులు
విజయవాడలో దారుణం జరిగింది. ఎదురింట్లో ఉంటున్న వివాహితను బలవంతంగా ఇంట్లోకి లాక్కొచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడో నిందితుడు. భర్త చేస్తున్న తప్పుడు పనిని అడ్డుకోవాల్సిన భార్య అతడికి సహకరించడమే కాకుండా, ఆ తతంగాన్ని వీడియో తీసింది.

కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అజిత్‌సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన బాధిత వివాహిత భర్త (25) కేటరింగ్ చేస్తుంటాడు. ఈ నెల 3న ఆమె తన ఇంట్లో పిల్లలతో కలిసి నిద్రపోతుండగా, వారి ఎదురింట్లో నివసించే దిలీప్, తులసి దంపతులు రాత్రి 11 గంటల సమయంలో ఆమె ఇంట్లోకి ప్రవేశించారు.

బాధిత మహిళ నోరు గట్టిగా మూసి తమ ఇంట్లోకి లాక్కెళ్లారు. ఆపై నిందితుడు ఆమెపై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడగా, అతడి భార్య వీడియోలు, ఫొటోలు తీసింది. ఆ తర్వాతి రోజు ఆ వీడియోలను చూపించి మరోమారు అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పిల్లలను చంపేస్తానని, ఫొటోలు బయటపెట్టి పరువు తీస్తానని హెచ్చరించాడు.

 తాజాగా, తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలని నిందితుడు పదేపదే వేధిస్తుండడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. నిందితులైన దిలీప్, తులసిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Vijayawada
Crime News
Rape Case
Andhra Pradesh

More Telugu News