Raviteja: 'పేకాటలో నలుగురు కింగ్స్ ఉంటారు .. ఈ ఆటలో ఒక్కడే కింగ్': రవితేజ 'ఖిలాడి' ట్రైలర్ రిలీజ్!

Khiladi trailer released
  • రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి'
  • రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ 
  • సినిమాపై ఆసక్తిని పెంచుతున్న ట్రైలర్ 
  • ఈ నెల 11వ తేదీన విడుదల  
రవితేజ కథానాయకుడిగా దర్శకుడు రమేశ్ వర్మ 'ఖిలాడి' సినిమాను రూపొందించాడు. భారీ బడ్జెట్ తో సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన సింగిల్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి - డింపుల్ అలరించనున్నారు.

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్  ను రిలీజ్ చేశారు. "ఎప్పుడూ ఒకే టీమ్ లో ఆడటానికి నేషనల్ ప్లేయర్ ను కాదు .. ఐపీఎల్ ప్లేయర్. ఎవడు ఎక్కువకి పాడుకుంటే వాడికే ఆడతాను" అనే రవితేజ డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఇది రవితేజ మార్క్ సినిమా అని చెప్పడానికి ఈ ఒక్క డైలాగ్ చాలు. 

కంటైనర్ లో కోట్ల రూపాయలు .. దానిని చేజిక్కించుకోవడానికి కొన్ని ముఠాలు రంగంలోకి దిగుతాయి. ఆ డబ్బు చుట్టూనే ఈ కథ తిరుగుతుందనే విషయం అర్థమవుతోంది. 'పేకాటలో నలుగురు కింగ్స్ ఉంటారు .. ఈ ఆటలో ఒక్కడే కింగ్ ఉంటాడు" అనే రవితేజ డైలాగ్ తో కథ ఏమిటనేది స్పష్టమవుతుంది. యాక్షన్ .. రొమాన్స్ .. కామెడీతో మాస్ సాంగ్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమా, ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
Raviteja
Meenakshi
Dimple
Khiladi Movie

More Telugu News