Somireddy Chandra Mohan Reddy: జగన్ హోల్ సేల్ గానూ, వైసీపీ ఎమ్మెల్యేలు రిటైల్ గానూ దోపిడీ చేస్తున్నారు: సోమిరెడ్డి

Jagan and YSRCP MLAs are looting the state says Somireddy
  • కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అవినీతిలో ముందంజలో ఉన్నారు
  • ఇసుక, మట్టిని కూడా దోపిడీ చేస్తున్నారు
  • పీఆర్సీ విషయంలో ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది
ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ నేత సోమిరెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని జగన్ హోల్ సేల్ గా దోచుకుంటుంటే, వైసీపీ ఎమ్మెల్యేలు రిటైల్ గా దోచుకుంటున్నారని అన్నారు. కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అవినీతిలో ముందంజలో ఉన్నారని ఆరోపించారు. కావలిలో ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యే అనుమతి కావాల్సిందేనని విమర్శించారు. ఇసుకను, మట్టిని కూడా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెపుతారని తెలిపారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు.
Somireddy Chandra Mohan Reddy
Telugudesam
Jagan
YSRCP

More Telugu News