SBI: ఆంధ్రా ఫెర్రో అల్లాయ్స్‌ను అమ్మకానికి పెట్టిన స్టేట్ బ్యాంక్

  • రూ. 26.73 కోట్లు బకాయి పడిన ఆంధ్రా ఫెర్రో అల్లాయ్స్
  • దీంతో పాటు మరో ఐదు కంపెనీలు కూడా వేలానికి
  • మొత్తంగా 406 కోట్లు రాబట్టు కోవడమే లక్ష్యం
  • వచ్చే నెల 4న స్విస్ చాలెంజ్ పద్ధతిలో వేలం
SBI Ready to Sell Andhra Ferro Alloys Limited

పెద్ద ఎత్తున బకాయి పడిన ఆంధ్రా ఫెర్రో అల్లాయ్స్‌ను భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) అమ్మకానికి పెట్టింది. ఆ సంస్థ నుంచి రూ. 26.73 కోట్ల మేర రావాల్సి ఉండగా తిరిగి చెల్లించడంలో విఫలమైంది. దీంతో కంపెనీని విక్రయించడం ద్వారా ఆ మొత్తాన్ని రాబట్టుకోవాలని నిర్ణయించింది. ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీలు (ఏఆర్‌సీ), బ్యాంకులు, ఎన్‌ఎఫ్‌సీలు, ఆర్థిక సంస్థలు వేలంలో పాల్గొన వచ్చని ఎస్‌బీఐ తెలిపింది.

‘స్విస్ చాలెంజ్’ పద్ధతిలో వచ్చే నెల 4న వేలం ద్వారా ఆంధ్రా ఫెర్రో అల్లాయ్స్‌ను వేలం వేయనున్నట్టు తెలిపింది. దీనితో పాటు మరో ఐదు కంపెనీలను కూడా వేలం వేయాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. ఈ ఆరు సంస్థల నుంచి ఎస్‌బీఐకి రూ. 406 కోట్లు రావాల్సి ఉంది.

More Telugu News