సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చిన కేంద్రం
- స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ కు డీసీజీఐ ఆమోదం
- దేశంలో 9కి పెరిగిన వ్యాక్సిన్లు
- తొలిసారి సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు అనుమతి
- కేంద్రమంత్రి మన్సూఖ్ మాండవీయ ప్రకటన
తాజాగా, స్పుత్నిక్ లైట్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ తో దేశంలో కరోనా వ్యాక్సిన్ల సంఖ్య 9కి పెరిగింది. ఈ కొత్త వ్యాక్సిన్ చేరికతో దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత బలోపేతం అవుతుందని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ఓ ప్రకటన చేశారు.