Babar Azam: లతా మంగేష్కర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్

Pakistan cricket team captain Babar Azam responds to Lata Mangeshkar demise
  • ఈ ఉదయం కన్నుమూసిన లతా మంగేష్కర్
  • శోకసంద్రంలో అభిమానులు
  • సరిహద్దులకు ఆవల కూడా విషాదఛాయలు
  • ఓ స్వర్ణయుగం ముగిసిందన్న బాబర్ అజామ్
గానకోకిల, సీనియర్ గాయని లతా మంగేష్కర్ మరణంతో అభిమానులు మూగబోయారు. ఆమె కన్నుమూత వారిని తీవ్ర విషాదానికి గురిచేస్తోంది. దేశ సరిహద్దులకు ఆవల కూడా లతా పాటలను అభిమానించేవారు ఆమె ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఉదయం లతా మంగేష్కర్ కన్నుమూయగా, పాకిస్థాన్ క్రికెట్ జట్టు సారథి బాబర్ అజామ్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.

లతా మంగేష్కర్ అస్తమయంతో ఓ స్వర్ణ యుగం ముగిసిందని పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది అభిమానులను ఆమె తన మంత్రముగ్ధ స్వరంతో అలరిస్తూనే ఉంటారని, ఆమె గంధర్వగానం ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుందని తెలిపాడు. అసమాన దిగ్గజం అని కొనియాడాడు. లతా మంగేష్కర్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ బాబర్ అజామ్ ట్వీట్ చేశాడు.
Babar Azam
Lata Mangeshkar
Demise
Singer
Pakistan
Cricket

More Telugu News