Salman Khan: తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో బాలీవుడ్ నటుడు... గమనిస్తుండాలంటూ తన వ్యక్తిగత వైద్యులకు సూచించిన సల్మాన్ ఖాన్

Salman Khan suggests his personal team of doctors to keep an eye on Sunil Grover health
  • ఇటీవల సునీల్ గ్రోవర్ కు హార్ట్ సర్జరీ
  • కరోనాకు గురైన నటుడు
  • ఇటీవలే డిశ్చార్జి
  • భరత్ చిత్రంలో సల్మాన్ తో నటించిన సునీల్ గ్రోవర్
బాలీవుడ్ కమెడియన్ సునీల్ గ్రోవర్ ఆరోగ్య పరిస్థితిపై స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించారు. కొంతకాలం కిందట సునీల్ గ్రోవర్ కు హార్ట్ సర్జరీ జరిగింది. గుండెకు రక్తప్రసరణ చేసే ధమనులు మూసుకుపోయాయి. దాంతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో అతడికి  కరోనా కూడా సోకింది.  ఇటీవల కరోనా నుంచి కోలుకోవడంతో సునీల్ గ్రోవర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు.

గ్రోవర్ పరిస్థితి తెలుసుకున్న సల్మాన్ ఖాన్ అతడి ఆరోగ్యంపై నిత్యం గమనిస్తుండాలని తన వ్యక్తిగత వైద్యుల బృందానికి సూచించారు. వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేస్తుండాలని స్పష్టం చేశాడు. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన భరత్ చిత్రంలో సునీల్ గ్రోవర్ కూడా నటించాడు. ఆ సమయంలో సల్మాన్ కు సునీల్ అత్యంత సన్నిహితుడయ్యాడు. సునీల్ గ్రోవర్ కరోనా సోకి ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా సల్మాన్ అతడి ఆరోగ్యంపై తరచుగా వాకబు చేసేవాడని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.
Salman Khan
Sunil Grover
Health
Bollywood

More Telugu News