సినిమాలే కాదు.. దేశ ప్రగతినీ కాంక్షించారు.. లతా మంగేష్కర్ మరణం దు:ఖం కలిగిస్తోందన్న ప్రధాని
- ఆ బాధను మాటల్లో వివరించలేను
- ఎంతో దయామయురాలు
- ఎంతో ఆప్యాయంగా చూసేవారన్న ప్రధాని
ఆమె పాడిన పాటలు ఎన్నెన్నో భావుకతలను అందరి మదిలో నింపాయని, ప్రపంచంలో భారత చిత్ర పరిశ్రమ ఎదుగుదలను ఆమె దగ్గరుండి చూశారని కొనియాడారు. సినిమాలే కాకుండా భారతదేశ ప్రగతి కోసమూ లత కృషి చేశారని ప్రశంసించారు. దృఢమైన అభివృద్ధి భారతాన్ని ఆమె ఎల్లప్పుడూ కోరుకునేవారని గుర్తు చేశారు.లత దీదీ తనను ఎంతో ఆప్యాయంగా చూసేవారని, అంత ఆప్యాయతను పొందిన తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని మోదీ అన్నారు. ఆమెతో తనకున్న మధురానుభూతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పారు. లత మరణం తోటి భారతీయులతో పాటు తనకూ దు:ఖం కలిగిస్తోందన్నారు. కాగా, లత కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.