Star Maa: ప్రెస్ నోట్: స్టార్ మా పరివార్ లీగ్

Watch Star Maa Parivar League season 3 from TODAY
 
ప్రెస్ నోట్: స్టార్ మా ప్రేక్షకుల ఆదివారాన్ని మరింత ఉత్సాహంగా మార్చిన షో "స్టార్ మా పరివార్ లీగ్" రెండు విజయవంతమైన సీజన్స్ పూర్తి చేసుకుని మూడో సీజన్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేసింది.
 
ఫిబ్రవరి 6 నుంచి.. ప్రతి ఆదివారం మ. 1.30 గం . లకు ఈ షో మూడో సీజన్ ఆరంభం కాబోతోంది. గత రెండు సీజన్ల కంటే ఎంతో ఘనంగా ఉండబోతున్న ఈ షో లో స్టార్ మా సీరియల్స్ పరివారంలో ఉన్న సుమారు 80 మంది సెలబ్రిటీ లు ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నారు.
 
షో లో నిర్వహించే రకరకాల టాస్కులు, ఆటలు, పాటలు.. అన్నీ కలిపి ఒక ప్యాకేజీ లా వినోదాన్ని అందించబోతున్నాయి. రెండు సీజన్లను ఎంతో విజయవంతం చేసిన ప్రేక్షకులు ఈ సీజన్ ని కూడా వాటిని మించి విజయవంతం చేయాలనీ స్టార్ మా కోరుకుంటోంది. ఎందుకంటే... ఈ సీజన్ 3.. 3 రేట్లు వినోదాన్ని అందించడానికి సర్వం సిద్ధం చేసింది. షో ని తీర్చిదిద్దడంలో ఎంతో సరదాని సంబరం రేంజ్ కి తీసుకెళ్లే యాంకర్ ఝాన్సీ ప్రేక్షకుల్ని మరింతగా ఉర్రూత లూగించబోతున్నారు.
 
"స్టార్ మా పరివార్ లీగ్"... సీజన్ 3... ప్రతి ఆదివారం మ. 1.30 గం . లకు.. తప్పక చూడండి.
 
"స్టార్ మా పరివార్ లీగ్" ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/vFuLn3NHFr8
 
Content Produced by: Indian Clicks, LLC
Star Maa
Star Maa Parivar League

More Telugu News