Saina Nehwal: సైనా నెహ్వాల్‌కు మరోమారు క్షమాపణలు చెప్పిన సినీ నటుడు సిద్ధార్థ్

Actor Siddharth tenders apology during police inquiry
  • మోదీ పంజాబ్‌ పర్యటనలో భద్రతా వైఫల్యంపై సైనా ట్వీట్
  • వివాదాస్పద రీతిలో స్పందించి విమర్శలు మూటగట్టుకున్న సిద్ధార్థ్
  • అప్పట్లోనే సైనాకు క్షమాపణలు
  • తాజాగా పోలీసుల విచారణకు హాజరై మరోమారు క్షమాపణ
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు ప్రముఖ నటుడు సిద్ధార్థ్ మరోమారు క్షమాపణలు తెలిపాడు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై సైనా ట్వీట్ చేయగా, సిద్ధార్థ్ వివాదాస్పద రీతిలో స్పందించాడు. ట్వీట్‌లో సిద్ధార్థ్ ఉపయోగించిన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉండడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు, జాతీయ మహిళా కమిషన్ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్ధార్థ్‌పై చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు పోలీసులను ఆదేశించింది.

తీవ్ర విమర్శలతో దిగొచ్చిన సిద్ధార్థ్ అప్పుడే సైనాకు క్షమాపణలు చెబుతూ ట్విట్టర్‌లో లేఖ పోస్టు చేశాడు. మరోవైపు, జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తులో భాగంగా సిద్ధార్థ్‌కు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా తాజాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసుల ఎదుట హాజరైన సిద్ధార్థ్.. సైనాపై తాను చేసిన వ్యాఖ్యల వెనక ఎలాంటి చెడు ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా ఆమెకు మరోమారు క్షమాపణలు తెలిపాడు.
Saina Nehwal
Actor Siddharth
Badminton
Narendra Modi

More Telugu News