Narendra Modi: ముచ్చింతల్ లోని శ్రీరామనగరానికి చేరుకున్న ప్రధాని మోదీ

PM Modi arrives Muchintal Sri Ramanagaram
  • హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని
  • కాసేపట్లో సమతామూర్తి విగ్రహావిష్కరణ
  • 216 అడుగుల ఎత్తుతో రామానుజాచార్యుల విగ్రహ నిర్మాణం
విశ్వ సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల భారీ విగ్రహావిష్కరణకు రంగం సిద్ధమైంది. హైదరాబాదులో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరానికి చేరుకున్నారు. కాసేపట్లో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా రామానుజాచార్యుల వారి విగ్రహానికి చిన్నజీయర్ స్వామి పూజలు నిర్వహించనున్నారు.

ముచ్చింతల్ లో 45 ఎకరాల విస్తీర్ణంలో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్మాణం జరుపుకుంది. 2014లో సమతామూర్తి కేంద్రానికి శంకుస్థాపన జరిగింది. దాదాపు రూ.12 వందల కోట్లతో నిర్మాణం పూర్తిచేసుకుంది. ఇందులో భాగంగా పంచలోహాలతో కూడిన శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహం ఎత్తు 216 అడుగులు. విగ్రహం దిగువన మూడంతస్తుల నిర్మాణం ఉంటుంది.
Narendra Modi
Sri Rama Nagaram
Muchintal
Hyderabad

More Telugu News