Andhra Pradesh: గనులశాఖ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించిన ఏపీ ప్రభుత్వం!

AP Govt ESMA act on mines department
  • గనుల శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి పేరిట ఉత్తర్వులు
  • చర్చలు జరుగుతున్న సమయంలో ఎస్మా ఏమిటని ప్రశ్నిస్తున్న ఉద్యోగులు
  • గనుల శాఖలో అత్యవసర సేవలు ఏం ఉంటాయని ప్రశ్న 
పీఆర్సీ విషయంలో ఏపీ ఉద్యోగులు సమ్మెబాట పట్టబోతున్న సంగతి తెలిసిందే. వీరికి ఆర్టీసీ ఉద్యోగులు సైతం జత కలిశారు. రేపు అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగబోతున్నారు. మరోవైపు ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ చర్చలు జరుపుతోంది. మరోవైపు ఉద్యోగులపై తమ మాట వినకుంటే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది.

మరోపక్క ఉద్యోగులపై ఏపీ గనుల శాఖ ఎస్మా ప్రయోగించింది. గనులశాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై గనుల శాఖ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నేతల మధ్య చర్చలు జరుగుతుంటే ఎస్మా ఉత్తర్వులు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. గనుల శాఖలో అత్యవసర సేవలు ఏం ఉంటాయని ప్రశ్నిస్తున్నారు.
Andhra Pradesh
Employees
ESMA
Mines Department

More Telugu News