Balakrishna: భారీ కాన్వాయ్ తో తరలివెళ్లి.. అనంతపురం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించిన బాలకృష్ణ

Balakrishna meets Ananthapuram District collector demanding district as Hidupuram headquarter
  • హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని వినతిపత్రం
  • నిన్న మౌనదీక్ష చేపట్టిన బాలయ్య
  • హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే రాజీనామా చేస్తానన్న బాలకృష్ణ
శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురంను ప్రకటించాలని కోరుతూ అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వినతిపత్రాన్ని అందించారు. నిన్న హిందూపురంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఆయన ర్యాలీ నిర్వహించి, మౌనదీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన సంచలన ప్రకటన చేశారు. హిందూపురం కేంద్రంగా జిల్లా ప్రకటించాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాదు హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే రాజీనామా చేస్తానని అన్నారు.

ఈ నేపథ్యంలో, ఆయన ఈరోజు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందించారు. అంతకు ముందు అఖిలపక్ష నేతలతో కలిసి ఆయన భారీ ర్యాలీగా హిందూపురం నుంచి అనంతపురంకు బయల్దేరారు. వందలాది వాహనాలతో ఆయన కలెక్టరేట్ కు చేరుకున్నారు. మరోవైపు, కలెక్టర్ ను కలిసిన సమయంలో ఆయన వెంట మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఉన్నారు.
Balakrishna
Telugudesam
Hindupuram
District
District Collector

More Telugu News