'చంద్రకళ'గా మెరిసిపోతున్న అనసూయ!
- రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి'
- రవితేజ సరసన ఇద్దరు నాయికలు
- ప్రత్యేకమైన పాత్రలో అనసూయ
- ఈ నెల 11వ తేదీన విడుదల
అలాంటి ప్రేక్షకులు 'చంద్రకళ'గా అనసూయను చూస్తే ఫుల్ ఖుషీ కావడం ఖాయమేనని అనిపిస్తుంది. రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమా రూపొందింది. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాలో, అనసూయ 'చంద్రకళ' పాత్రలో కనిపించనుంది. ఇది రవితేజకి అత్త పాత్రని అంటున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి అనసూయ పోస్టర్ ను రిలీజ్ చేశారు. బ్లాక్ శారీలో నిండుగా కనిపిస్తూ .. ఒకింత సిగ్గుపడుతున్న ఈ పోస్టర్ లో అనసూయ చాలా అందంగా కనిపిస్తోంది. చూడబోతే ఈ సినిమాకి అనసూయ లుక్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది.