Kapu: కాపులకు ఊరట... తుని ఘటనలో నమోదైన కేసుల ఎత్తివేత

  • 2016లో ఉద్ధృతంగా కాపు ఉద్యమం
  • ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో పోరుబాట
  • తునిలో భారీ బహిరంగ సభ
  • రైలుకు నిప్పంటించిన ఆందోళనకారులు
AP Govt lifts police cases upon Kapu people in related to Tuni incident

రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో 2016లో కాపు ఉద్యమం ఉద్ధృతంగా సాగిన సంగతి తెలిసిందే. అయితే, నాడు తునిలో జరిగిన కాపుల బహిరంగ సభ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టారు. దాంతో ఈ ఘటనకు సంబంధించి కాపులపై 69 కేసులు నమోదయ్యాయి. ఇతర అంశాలపైనా కేసులన్నీ కలిపి 161 వరకు ఉంటాయి.

ఈ నేపథ్యంలో కాపులకు ఊరట కల్పించేలా తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైలును దగ్ధం చేసిన ఘటనలో కాపులపై నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ప్రత్యేక జీవో జారీ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కాపులపై నమోదైన కేసులు తొలగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

More Telugu News