Allu Arjun: పునీత్ రాజ్ కుమార్ కు నివాళి అర్పించిన అల్లు అర్జున్.. ఫొటోలు ఇవిగో!

Aallu Arjun  pays tribute to Puneet Raj Kumar
  • పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అర్జున్
  • అల్లు అర్జున్ వెంట ఉన్న శివరాజ్ కుమార్
  • అక్టోబర్ 29న మృతి చెందిన పునీత్
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ చిన్న వయసులోనే ఇటీవల హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం దేశ సినీ పరిశ్రమనే కాకుండా, లక్షలాది మంది అభిమానులను కంటతడి పెట్టించింది. అక్టోబర్ 29న పునీత్ మృతి చెందారు. తాజాగా పునీత్ కు అల్లు అర్జున్ నివాళి అర్పించారు. బెంగళూరుకు వెళ్లిన ఆయన పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

'పుష్ప' సినిమా సందర్భంగా ఇటీవల అల్లు అర్జున్ బెంగళూరుకు వెళ్లారు. ఆ సందర్భంగా పునీత్ కుటుంబాన్ని కలుస్తారా? అంటూ మీడియా ఆయనను ప్రశ్నించింది. దీనికి సమాధానంగా... తాను తన సొంత సినిమా పని మీద వచ్చానని... సొంత పని మీద వచ్చి అలా కలవడం మర్యాద కాదని బన్నీ చెప్పాడు. తర్వాత తాను వచ్చి పునీత్ కుటుంబాన్ని కలుస్తానని తెలిపాడు.

 అన్నట్టుగానే ఈరోజు ఆయన బెంగళూరుకు వెళ్లి పునీత్ కుటుంబాన్ని కలిశారు. ఈ సందర్భంగా పునీత్ అన్న, హీరో శివరాజ్ కుమార్ ఆయనతో పాటే ఉన్నారు. మరోవైపు పునీత్, అల్లు అర్జున్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉందనే విషయం గమనార్హం.
Allu Arjun
Tollywood
Puneet Raj Kumar
Tributes

More Telugu News