CM Jagan: సచివాలయంలో సీఎం జగన్ తో సజ్జల, సీఎస్ భేటీ

CM Jagan held meeting with Sajjala and CS
  • లక్షమందితో 'ఛలో విజయవాడ' విజయవంతం
  • ఉద్యోగుల నిరసనల నేపథ్యంలో సీఎం మీటింగ్ 
  • సమావేశంలో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి  
  • సాయంత్రం 6 గంటలకు సీఎస్ ప్రెస్ మీట్ 
ఉద్యోగుల ఛలో విజయవాడ విజయవంతం అయిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ తో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ సమావేశం అయ్యారు. ఈ భేటీలో వైసీపీ అగ్రనేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు. కాగా, ఛలో విజయవాడ కార్యక్రమం గురించి సీఎం జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగుల డిమాండ్లు, పెన్ డౌన్, సమ్మె తదితర కార్యాచరణలపై సజ్జల తదితరులతో చర్చించారు.

కాగా, ఈ సాయంత్రం 6 గంటలకు సీఎస్ సమీర్ శర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. సీఎం జగన్ తో చర్చించిన విషయాలపై ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.

కొంతకాలంగా తమ డిమాండ్ల కోసం ఉద్యమిస్తున్న ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు నేడు భారీ ఎత్తున విజయవాడ తరలిరావడం తెలిసిందే. ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో 'ఛలో విజయవాడ' కార్యక్రమాన్ని అనూహ్య రీతిలో విజయవంతం చేశారు.
CM Jagan
Sajjala Ramakrishna Reddy
CS
Chalo Vijayawada

More Telugu News