East Godavari District: ఏపీలో కల్తీ కల్లు తాగి ఐదుగురి మృతి!

5 dead in East Godavari district
  • తూర్పుగోదావరి జిల్లా లోదొడ్డి గిరిజన గ్రామంలో విషాదం
  • జీలుగు కల్లు తాగి ఐదుగురి దుర్మరణం
  • తాగిన వెంటనే వికటించిన కల్లు

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కల్తీ జీలుగు కల్లు తాగి, ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన రాజవొమ్మంగి మండలంలోని లోదొడ్డి గిరిజన గ్రామంలో చోటుచేసుకుంది. మృతులందరూ గిరిజనులే కావడం గమనార్హం. గ్రామంలో లభించే జీలుగు కల్లును ఎప్పటి మాదిరే వారు తాగారు. అయితే కాసేపటికే అది వికటించింది.

వెంటనే స్పందించిన స్థానికులు వారిని జడ్డంగిలోని ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఒకరు మృతి చెందారు. మిగిలిన వారి పరిస్థితి కూడా విషమించడంతో వారిని అడ్డతీగల పీహెచ్సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

  • Loading...

More Telugu News