Lavanya Tripathi: వరుణ్ తేజ్ తో పెళ్లి అనే వార్తలపై లావణ్య త్రిపాఠి స్పందన!

Lavanya Tripathi response on marriage with Varun Tej
  • వరుణ్ తేజ్ తో లావణ్య ప్రేమలో ఉందంటూ ప్రచారం
  • ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు
  • నా పెళ్లి ఎవరితోనో నాకే తెలియదన్న లావణ్య
టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవలే వరుణ్ తేజ్ పుట్టినరోజు జరగింది. ఆ రోజున లావణ్యకు వరుణ్ ప్రపోజ్ చేశాడంటూ ప్రచారం జరుగుతోంది.

తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన లావణ్యకు ఈ అంశంపైనే ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై ఆమె స్పందిస్తూ, తన పెళ్లి ఎవరితో అనే విషయం తనకే తెలియదని చెప్పారు. తనకే తెలియని విషయం వేరే వాళ్లకు ఎలా తెలుస్తుందోనని అన్నారు. అయితే మీరు ఎవరితోనూ ప్రేమలో లేరని చెపుతున్నారా? అనే మరో ప్రశ్నకు ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం.
Lavanya Tripathi
Varun Tej
Dating
Marriage
Tollywood

More Telugu News