Andhra Pradesh: 21 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన నాదల్ కు.. ఏపీతో ప్రత్యేక అనుబంధం!

Rafael Nadal Has Special Relation With AP
  • అనంతపురంలో టెన్నిస్ స్కూల్ ఏర్పాటు
  • పేద పిల్లలకు ఉచితంగా శిక్షణ
  • ఫ్రీగా క్రీడా పరికరాల పంపిణీ

21 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచి తానేంటో మరోసారి నిరూపించాడు స్పెయిన్ టెన్నిస్ బుల్ రాఫెల్ నాదల్. మొన్న జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ లో దిమిత్రీ మెద్వదేవ్ పై గెలిచి చరిత్ర సృష్టించాడు. బుల్ అని రఫాను ముద్దుగా పిలిచినా.. అతడు చాలా సున్నిత మనస్కుడట. ఫుట్ బాలర్ గా ఎదగాల్సిన వాడు.. రాకెట్ చేతబట్టి సక్సెస్ కొడుతున్నాడు. అంతేకాదండోయ్.. నాదల్ కు ఆంధ్రప్రదేశ్ తో ప్రత్యేక అనుబంధం ఉంది.

అనంతపురంలోని పేద పిల్లలకు టెన్నిస్ ను మరింత చేరువ చేసేందుకు 2010లో ‘నాదల్ ఎడ్యుకేషనల్ టెన్నిస్ స్కూల్’ను ఏర్పాటు చేశాడు. స్పెయిన్ కు చెందిన ఫెర్రర్ అనే వ్యక్తి అనంతపురం జిల్లాలో గ్రామీణాభివద్ధి ట్రస్ట్ ను నిర్వహిస్తున్నాడు. దాని గురించి తెలుసుకున్న నాదల్.. ఆ ట్రస్ట్ సహకారంతోనే అనంతపురంలో టెన్నిస్  స్కూల్ ను ప్రారంభించాడు.

ఆ స్కూల్ ను తన తల్లి అన్నా మరియా చేతుల మీదుగానే నాదల్ ప్రారంభించాడు. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు ఉచితంగా శిక్షణనిస్తున్నారు. క్రీడా పరికరాలను అందిస్తున్నారు. తర్వాత ఈ స్కూల్ ను స్పెయిన్ కీ విస్తరించాడు.

  • Loading...

More Telugu News