ఏపీ విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ
- కమిషన్ ను నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు
- చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్
- వేతనం, అలవెన్సుల సవరణపై అధ్యయనం
కాగా, పీఆర్సీపై ఇప్పటికే ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త పీఆర్సీతో నష్టపోతున్నామని, పాత జీతం కన్నా తక్కువ వస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రుల కమిటీతో నిన్న జరిగిన సమావేశం కూడా సత్ఫలితాలనివ్వలేదు.