గుంటూరు జిన్నా టవర్ పేరు మార్చే ప్రసక్తేలేదు: మేయర్ మనోహర్ నాయుడు
- గుంటూరులో ప్రసిద్ధ కట్టడంగా జిన్నా టవర్
- సోము వీర్రాజు అభ్యంతరం
- జిన్నా దేశ విభజనకు కారకుడని బీజేపీ విమర్శలు
- మతపెద్దలతో నేడు ప్రజాప్రతినిధుల సమావేశం
ఈ నేపథ్యంలో, నేడు జిన్నా టవర్ అంశంపై మతపెద్దలతో ప్రజాప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు, నగరపాలక కమిషనర్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జిన్నా టవర్ వద్ద ఎల్లుండి జాతీయ జెండా ఆవిష్కరించాలని ముక్తకంఠంతో తీర్మానించారు. మేయర్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ, జిన్నా టవర్ పేరు మార్చే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.