Chiranjeevi: వీరాభిమాని కుమార్తె పెళ్లికి చిరంజీవి ఆర్థికసాయం

Chiranjeevi finanically helps his fan daughter marriage
  • చిరంజీవి వీరాభిమానిగా గుర్తింపు తెచ్చుకున్న కొండలరావు
  • కొండలరావు కుమార్తెకు పెళ్లి కుదిరిన వైనం
  • చిరంజీవికి సమాచారం
  • లక్ష రూపాయలు అందజేసిన మెగాస్టార్

అభిమానులే తన మెగా బలం అని చిరంజీవి నమ్ముతారు. అభిమానుల పట్ల ఆయన ఎంతో ఆపేక్ష చూపిస్తారు. తాజాగా, ఓ వీరాభిమాని కుమార్తె పెళ్లికి ఆర్థికసాయం చేశారు. రాజాం కొండలరావు మెగాస్టార్ చిరంజీవి అంటే విపరీతమైన అభిమానం ప్రదర్శిస్తారు. కొండలరావు కుమార్తె నీలవేణికి ఇటీవల పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలిసిన చిరంజీవి... తన అభిమాని కుమార్తె పెళ్లి కోసం లక్ష రూపాయలు అందజేశారు. ఆ అమ్మాయికి తన ఆశీస్సులు అందజేశారు. ఈ విషయాన్ని అఖిల భారత చిరంజీవి అభిమానుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

  • Loading...

More Telugu News