Lavanya Tripathi: తనను చౌకబారు నటి అన్న నెటిజన్ కు ఘాటుగా రిప్లై ఇచ్చిన లావణ్య త్రిపాఠి!

Lavanya Tripathi fires on netizen who called her cheap actress
  • తమిళనాడులో లావణ్య అనే దళిత అమ్మాయి ఆత్మహత్య
  • లావణ్య త్రిపాఠి హ్యాష్ ట్యాగ్ తో స్పందిస్తున్న కొందరు నెటిజన్లు
  • లావణ్య ఒక చీప్ నటి అన్ని ఓ నెటిజన్

మత మార్పిడికి బలవంతం చేశారంటూ లావణ్య అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు లావణ్య అనే హ్యాష్ ట్యాగ్ కు బదులు, లావణ్య త్రిపాఠి అనే హ్యాష్ ట్యాగ్ వాడుతున్నారు. దీంతో ఓ నెటిజన్ లావణ్య త్రిపాఠిని ఉద్దేశించి అభ్యంతరకర కామెంట్ చేశాడు.
 
'లావణ్య త్రిపాఠి హ్యాష్ ట్యాగ్ వాడకండి. ఆమె ఒక సినీ నటి. లావణ్య తమిళనాడుకు చెందిన ఓ సామాన్య దళిత బాలిక. ధర్మం కోసం ఆమె తన జీవితాన్ని త్యాగం చేసింది. ఆమెను చౌకబారు నటితో పోల్చకండి' అని ట్వీట్ చేశాడు. దీనిపై లావణ్య త్రిపాఠి ఘాటుగా స్పందించింది.

'ఏదైనా ఒక దారుణం జరిగిన తర్వాతే మీలాంటి వాళ్లు మహిళలను గౌరవించడాన్ని ఎందుకు ప్రారంభిస్తారు? అంతకు ముందు ఆమెను చీప్ అని అంటారు. అందరినీ గౌరవించడం నేర్చుకోండి. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. కానీ సమాజం యొక్క నిజ స్వరూపం ఇదే' అని కౌంటరిచ్చింది.

  • Loading...

More Telugu News