ఏపీలో కొత్తగా 5,879 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 25,284 కరోనా పరీక్షలు
- అనంతపురం జిల్లాలో 856 కొత్త కేసులు
- విజయనగరం జిల్లాలో 12 మందికి పాజిటివ్
- రాష్ట్రంలో 9 మంది మృతి
- ఇంకా 1,10,517 మందికి చికిత్స
అదే సమయంలో 11,384 మంది ఆరోగ్యవంతులు కాగా, 9 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,615కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,76,370 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 21,51,238 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,10,517 మందికి చికిత్స కొనసాగుతోంది.