ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డికి కరోనా

30-01-2022 Sun 21:11
  • గత రెండ్రోజులుగా శ్రీకాంత్ రెడ్డికి జలుబు, దగ్గు
  • కరోనా టెస్టుల్లో పాజిటివ్
  • హోం ఐసోలేషన్ లో ఉన్నానని శ్రీకాంత్ రెడ్డి వెల్లడి
  • తనను కలిసినవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచన
Gadikota Srikanth Reddy tested corona positive
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. శ్రీకాంత్ రెడ్డి గత రెండ్రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

తనకు కరోనా సోకిందని, ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నానని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.