Vijay Sai Reddy: విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టగానే బాబు కంటే మొదట మూర్ఛపోయింది యనమలే: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy comments on Yanamala
  • విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు
  • సర్వత్రా హర్షం
  • యనమలపై ధ్వజమెత్తిన విజయసాయి
  • ఎన్టీఆర్ శాపం అంటూ ట్వీట్

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ప్రతిపాదన చేయడం తెలిసిందే. దీనిపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరుపెట్టగానే బాబు కంటే మొదట మూర్ఛపోయింది యనమలేనని వ్యంగ్యం ప్రదర్శించారు. 'రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ వ్యవస్థాపకుడి పేరు వినడానికే ఇష్టపడడట ఈ నమ్మకద్రోహి' అంటూ యనమలపై ధ్వజమెత్తారు. 'ఎన్టీఆర్ శాపం వల్లే ప్రత్యక్ష ఎన్నికల్లో యనమల వరుసగా ఓడిపోతున్నాడని రాష్ట్రమంతా ప్రచారంలో ఉందని' ఎద్దేవా చేశారు. 

  • Loading...

More Telugu News