Nikhil: అటు '18 పేజెస్' .. ఇటు 'కార్తికేయ 2'

Nikhil movies update
  • ముగింపు దశలో '18 పేజెస్'
  • త్వరలోనే పూర్తికానున్న 'కార్తికేయ 2' 
  • ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ 
  • మరో రెండు ప్రాజెక్టులు లైన్లో పెట్టిన నిఖిల్   
యువ కథానాయకులలో ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళ్లేవారిలో నిఖిల్ ఒకరుగా కనిపిస్తాడు. ఒక ప్రాజెక్టు ఓకే అనుకున్న తరువాత దర్శక నిర్మాతలతో చివరివరకూ జర్నీ చేసే హీరోగా నిఖిల్ కి అలవాటు. అలాంటి నిఖిల్ నుంచి 'అర్జున్ సురవరం' తరువాత ఇంతవరకూ మరో సినిమా రాలేదు.

కరోనా ఎఫెక్ట్ వలన ఆయన అనుకున్న సినిమాలు పూర్తి కాలేదు .. అందువలన అవి థియేటర్లకు రాలేదు. ప్రస్తుతం ఆయన మధ్యలో ఆగిపోయిన '18 పేజెస్' షూటింగును పూర్తిచేసే పనిలో ఉన్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగు, మరో 10 రోజుల్లో పూర్తికానుంది.

ఆ తరువాత ఆయన చందూ మొండేటితో కలిసి 'కార్తికేయ 2' సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమా కూడా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ రెండు సినిమాల్లోను కథానాయిక అనుపమ పరమేశ్వరన్ కావడం విశేషం. ఇక 'కార్తికేయ 2'లో స్వాతిరెడ్డి కూడా కనిపించనుంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి. ఆల్రెడీ మరో రెండు ప్రాజెక్టులను నిఖిల్ లైన్లో పెట్టాడు.
Nikhil
Anupama Parameshwaran
Swathi Reddy

More Telugu News