ఎవరికి మేలు చేయడానికి జిల్లాలను పెంచుతున్నారు?: బొండా ఉమ

28-01-2022 Fri 15:44
  • జిల్లాలను పెంచడం వల్ల ఎవరికైనా ప్రయోజనాలు చేకూరుతాయా? 
  • కొత్త జిల్లాలతో ఏం సాధిస్తారు?
  • మూడేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు
Bonda Uma questions for whose benefit are new disticts
కొత్త జిల్లాల ఏర్పాటుపై టీడీపీ నేత బొండా ఉమ ప్రశ్నలు లేవనెత్తారు. ఎవరికి మేలు చేసేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. జిల్లాలను పెంచడం వల్ల ఎవరికైనా ప్రయోజనాలు చేకూరుతాయా? అని అన్నారు. ఒకవేళ చేకూరేట్టయితే... ఏ విధంగా ప్రయోజనాలు చేకూరుతాయో చెప్పాలని అడిగారు. గత మూడేళ్ల నుంచి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని... ఇప్పుడు  కొత్త జిల్లాలతో ఏం సాధిస్తారని ఎద్దేవా చేశారు. అమ్మకు అన్నం పెట్టలేనోడు... చిన్నమ్మకు పట్టుచీర కొంటానని అన్నట్టుగా ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాల్లో సమతుల్యత లేదని అన్నారు.